salman-khan-sonamkapoor-prem ratan dhan payoబాలీవుడ్‌లో కొన్ని సంవత్సరాల క్రితం వరకు 100 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 100 కోట్లు వసూళ్లు చేసిన సినిమా అంటే అది మామూలు సినిమా కాదు. కాని ఇప్పుడు యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నా, బిలో యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నా కూడా 100 కోట్లు ఈజీగా వస్తున్నాయి. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించిన ప్రతి ఒక్క సినిమా 100 కోట్లను కొల్ల గొడుతూ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తూనే ఉంది. ఈ సంవత్సంలో ఇప్పటికే ‘భజరంగీ భాయిజాన్‌’ చిత్రంతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన సల్మాన్‌ ఖాన్‌ తాజాగా ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ చిత్రంతో మరోసారి ఆ మార్క్‌ను దక్కించుకున్నాడు.

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా, సోనమ్‌ కపూర్‌ హీరోయిన్‌గా సూరజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ చిత్రం జస్ట్‌ యావరేజ్‌ టాక్‌ను తెచ్చుకుంది. అయినా కూడా ఈ సినిమా కలెక్షన్స్‌ సూపర్‌గా ఉన్నాయి. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసి 200 కోట్ల మార్క్‌ వైపుకు దూసుకు పోతుంది. బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా లాంగ్‌ రన్‌లో అన్ని భాషల్లో కలిపి 200 కోట్లకు పైగా వసూళ్లు చేయడం ఖాయం అని అంటున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ప్రేమలీల’గా డబ్బింగ్‌ చేసిన విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో ‘ప్రేమలీల’ ఆశించిన స్థాయిలో మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ కలెక్షన్స్‌కు కారణం సల్లూ భాయ్‌ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.