salman khan Kisi Ka Bhai Kisi Ki Jaan First Lookబాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఈరోజు ట్విట్టర్ లో తన అభిమానులందరికి మంచి ట్రీట్ ఇచ్చాడు. తన రాబోయే సినిమాల విడుదల తేదీలు ప్రకటించాడు. యాష్ రాజ్ ఫిలిమ్స్ తో చేస్తున్న ‘టైగర్ 3’ సినిమా 2023 దీపావళికి రిలీజ్ అవుతుంది. ‘కిసికా భాయ్ కిసి కి జాన్’ సినిమా ఈద్ సినిమా 2023 ఈద్ పండుగ రోజు విడుదలవుతుందని సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు.

అలాగే ఆ సినిమా పోస్టర్స్ కూడా రిలీజ్ చేసాడు భాయ్. టైగర్ 3 పోస్టర్లో మాస్ లుక్ తో ఆకట్టుకున్నా..కిసికా భాయ్ కిసి కి జాన్ పోస్టర్ లో సల్మాన్ భాయ్ లుక్ చూసి తెలుగు ప్రేక్షకులు నవ్వుతున్నారు. కొందరైతే హీరో ఎవరు అని కూడా అడుగుతున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ చూసి, హీరో కి హెయిర్ కట్ చేయించుకోడానికి డబ్బులు లేవా ? అని కొందరు నవ్వుతున్నారు. సల్మాన్ హెయిర్ స్టైల్ మరీ టూమచ్ అనిపిస్తుంది.

కిసికా భాయ్ కిసి కి జాన్ సినిమా లో విక్టరీ వెంకటేష్ అతిధి పాత్ర పోషిస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి ‘కె.జి.ఎఫ్’ రవిబాస్రూర్ నేపథ్య సంగీతాన్ని ఇస్తుండగా , ఫహద్ సంజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.