Salman Khan, Salim Khan Satires Salman Khan Marriage, Salim Khan Jokes Salman Khan Marriage, Salim Khan Comments Salman Khan Marriageప్రముఖ బాలీవుడ్ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ వివాహం గురించి, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ రచయిత అయిన సలీమ్ ఖాన్ త్వరలో ఓ రేడియో షోను హోస్ట్ చేయనున్నారు. ఈ షో గురించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టిన ఆయన… ఈ షోలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం ఇస్తానని, ఒక్క సల్మాన్ పెళ్లికి సంబంధించిన ప్రశ్నలకు మాత్రం తప్ప అని చమత్కరించారు. ఎందుకంటే, సల్మాన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడన్న విషయం తనకే కాదు, ఆ దేవుడికి కూడా తెలియదని చెప్పి శ్రోతలకు నవ్వులు పూయించాడు.

ముంబై లోకల్ రేడియో ‘రేడియో నషా 919’లో ’70 ఎంఎం’ అనే షోను నిర్వహించనున్న సలీమ్ ఖాన్, కేవలం వారాంతాల్లో రెండు రోజుల పాటు రోజూ రెండు గంటల పాటు అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. నిజానికి తన పెళ్లి తేదీపై ఇటీవల సల్మానే ఓ పంచ్ వేసుకున్న విషయం తెలిసిందే. సంవత్సరం తెలుపకుండా డిసెంబర్ 18వ తేదీన తన వివాహం అంటూ ‘సుల్తాన్’ విడుదల సందర్భంలో సల్మాన్ వ్యాఖ్యానించిన సంగతులు అభిమానులకు విదితమే.