salaries cut to Andhra Pradesh employees working in hyderabad -Chandrababu Naiduఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ యంత్రాంగమంతా హైదరాబాద్ నుండి అమరావతికి తరలి వచ్చిన తరువాత కూడా హైదరాబాద్ లోనే ఉంటూ రాము అని మొండి కేస్తున్న అధికారాలపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో సార్లు చెప్పినా రాకపోవడంతో ఇంక వారికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వారి జీతాలు నిలిపి వెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వారికి నోటీసులు కూడా పంపినట్టు తెలుస్తుంది.

ఏపీ అడ్వకేట్ జనరల్ కార్యాలయం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం, ఏపీ ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కార్యాలయం, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏపీ గవర్నమెంట్ ప్లీడర్ కార్యాలయం, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, రాష్ట్ర పునర్విభజన కార్యాలయం, డైరెక్టరు అఫ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ఏపీ స్టేట్ ఆర్కైవ్స్ కార్యాలయం, ఆర్మ్ పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలు ఇంకా హైదరాబాద్ లోనే కొనసాగుతున్నాయి. ఈ నెల 15లోగా రావాలని చెప్పినట్టు సమాచారం.

16 కల్లా ఆ కార్యాలయాలన్నీ ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సహా అమరావతికి రాకపోవడంతో జీతాలు చెల్లించవద్దని ఆర్ధిక శాఖకు ఉత్తరువులు ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటిదాకా వేరే వేరే కారణాలు చెబుతూ వీరు అమరావతికి రావడం వాయిదా వేస్తూ వచ్చారు. తాజా ఉత్తరువులను కూడా లెక్క పెట్టలేదు. మరి కొన్ని నెలలలో ఎన్నికలు ఉండటంతో ఇటువంటి కఠిన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని వారు అనుకోలేదు. అయితే ముఖ్యమంత్రి సీరియస్ అయ్యి వారి మీద చర్యలకు ఉపక్రమించారు.