Salman-khan hit and run caseఇటీవలే ‘హిట్ అండ్ రన్’ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ద్వారా శిక్ష నుండి బయటపడిన సల్మాన్ ఖాన్ మరోసారి కోర్టు మెట్లేక్కన్నున్నారు. భారీ శిక్ష నుండి విముక్తి లభించిన కొన్ని రోజులకే మరో కేసులో ఉన్న సల్మాన్ పేరు ఈ సూపర్ స్టార్ ను కోర్టు చేర్చనుంది.

రాజస్థాన్ లో కృష్ణజింకలను వేటాడిన కేసులోనూ సల్మాన్ ముద్దాయిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ పై జోధ్ పూర్ కోర్టులో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసు విచారణ కోసమే సల్మాన్ మరోమారు జోధ్ పూర్ కోర్టుకు హాజరు కానున్నారు. నేడు కోర్టుకు రానున్న నేపధ్యంలో సల్మాన్ ను వీక్షించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు.