Salaar - John Abrahamఇండియన్ సినిమా అంతా ప్రశాంత్ నీల్ మేనియా లో ఊగిపోతోంది. నిన్న రాత్రి విడుదలైన కేజీఎఫ్ 2 టీజర్ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ సినిమా నే అలా ఉంటే ప్రభాస్ తో నీల్ చెయ్యబోయే సినిమా సలార్ ఇంకా ఎలా ఉంటుంది అని అంతటా చర్చ జరుగుతుంది. ప్రశాంత్ నీల్ సలార్ యొక్క ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించారు.

కెజిఎఫ్ సిరీస్ కి పని చేసిన సాంకేతిక నిపుణులనే ఈ చిత్రానికి కూడా పునరావృతం చేయాలని దర్శకుడు నిర్ణయించారు. కెజిఎఫ్ యొక్క సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ మరియు ఫైట్ మాస్టర్స్ సలార్ కోసం కూడా పని చేస్తారు. మరోవైపు… ఈ సినిమా తారాగణం కూడా ఖరారు అవుతోంది.

ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంను సంప్రదించినట్లు వర్గాలు చెబుతున్నాయి. అతను ఈ సినిమాలో విలన్ గా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని బజ్. వారిలో ఒకదానికి దిశా పటానీని పరిశీలిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘ది మోస్ట్ వైలెంట్ మెన్..కాల్డ్ వన్ మ్యాన్ .. మోస్ట్ వైలెంట్’ అనే శక్తివంతమైన క్యాప్షన్ పెట్టారు. ఈ చిత్రం నీల్ శైలిలో మాస్ మసాలా ఎంటర్టైనర్ కానుందని ఈ క్యాప్షన్ సూచిస్తుంది. సలార్ ఈ షూటింగ్ ఈ నెలలోనే మొదలవుతుందని వార్తలు వచ్చాయి అయితే ఇప్పటివరకు చిత్రబృందం దానిని ధృవీకరించలేదు.