Sakshi-Pawan-Kalyan-MAA-Film-Chamber-Protestజనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి టీడీపీ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. కొందరి మీడియా ప్రముఖులతో కుమ్మక్కు అయ్యి దాదాపుగా 10 కోట్లు ఖర్చుపెట్టి రామగోపాల్ వర్మ ద్వారా శ్రీరెడ్డితో తన తల్లిని దూషించేలా చేసారని ఆయన లోకేష్ పై ఆరోపణలు గుప్పించారు. టీవీ9, ఆంధ్రజ్యోతి అధినేతలను డైరెక్టుగానే ఈ కుట్రలో భాగస్వాములు అని నిందించారు పవన్ కళ్యాణ్.

ఇది ఇలా ఉండగా ఆ తరువాత ఆయన ఫిల్మ్ ఛాంబర్ కు వెళ్లి తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ‘మా’ అసోసియేషన్‌, నిర్మాతల మండలిని పవన్‌ ప్రశ్నించారు. శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక తానున్నానని రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించారు.

తనకు న్యాయం జరిగే వరకు ఫిలిం ఛాంబర్‌ వదిలి వెళ్లేది లేదని పవన్‌ స్పష్టం చేశారు. ఆయనకు మద్దతుగా మెగా ఫామిలీ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు కూడా చేరుకున్నారు. ఈ మొత్తం తంతును టీవీ ఛానళ్ళు పెద్దగా టెలికాస్ట్ చేసింది లేదు. అయితే శత్రువుకు శత్రువు మిత్రుడు అని సూత్రంతో సాక్షి మాత్రం ఫుల్ గా కవరేజ్ ఇచ్చింది. కొద్దీ రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏజెంట్ అని ఆయన సినిమా వార్తలు కూడా సాక్షి ప్రచారం చెయ్యని సంగతి తెలిసిందే.