YS-Sharmila-Sakshiవైఎస్ షర్మిల పార్టీ వ్యవహారాలు మొదలుపెట్టిన తొలినాళ్ళలో సాక్షి పూర్తిగా అందుకు సంబంధించిన వార్తలను బ్లాక్ ఔట్ చెయ్యడం మొదలుపెట్టింది. అసలు అటువంటి విషయమే జరగనట్టు గా వ్యవహరించడం చేసింది. అయితే కొద్ది రోజుల తరువాత మళ్లీ కవరేజ్ ఇవ్వడం మొదలుపెట్టింది సాక్షి. వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇచ్చే అంతటి కవరేజ్ కాదు గానీ బాగానే చేస్తుందని చెప్పుకోవాలి.

దీనితో అన్నా చెల్లెళ్ళ మధ్య సయోధ్య కుదిరిందా అని చాలా మంది అనుకున్నారు. అయితే లోటస్ పాండ్ లోని వర్గాలను బట్టి తెరవెనుక చాలా విషయమే జరిగిందట. సాక్షిలో బ్రదర్ అనిల్ కుమార్ వాటాలు కూడా గట్టిగానే ఉన్నాయట. తమకు కూడా హక్కు ఉందని, తమ పార్టీకి కూడా కవరేజ్ ఇవ్వాల్సిందే అని షర్మిల విజయమ్మ తో కబురు పంపిందట.

ఒకవేళ జరగకపోతే బోర్డ్ సమావేశం జరిపి ఒక నిర్ణయం తీసుకుందాం అని గట్టిగానే హెచ్చరించడం తో ఇక చేసేది ఏమీ లేక ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలలో తలదూర్చనంత వరకు ఓకే అని జగన్, భారతి ఒప్పుకున్నారట. ఇప్పటివరకు బానే ఉంది. భవిష్యత్తులో పూర్తి స్థాయి రాజకీయాలు షర్మిల పార్టీ మొదలుపెట్టినప్పుడు అది ఇబ్బంది అవ్వొచ్చు. జగన్ కు కేసీఆర్, బీజేపీల నుండి ఇబ్బంది కలగవచ్చు.

మునుముందు ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. మరోవైపు… షర్మిల పార్టీ నామకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని సమాచారం. ఎన్నికల సంఘం నుండి అనుమతులు రాగానే ఒక భారీ బహిరంగసభ పెట్టి పార్టీని ప్రకటించాలని ఆమె అనుకుంటున్నారట. తెలంగాణలో ప్రజల అభిమానాన్ని చూరగొనేందుకు ఒక పాదయాత్ర చెయ్యాలని ఆమె ఆలోచన. ఎన్నికల ముందు కాకుండా ముందే చెయ్యాలని అనుకుంటున్నారట.