jagan- sakshiకరోనా రక్కసి వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. మందులు, ఆక్సిజన్ కొరత తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జబ్బు పడిన వారికి కనీసం బెడ్లు దొరకని పరిస్థితి. ఒక పక్క ఇటువంటి హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి ఉన్నా అధికార పార్టీ సొంత పత్రిక, సాక్షి మాత్రం అంతా బావుంది. జగన్ చల్లని పాలనలో రాష్ట్రమంతా సూపర్ గా ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది.

ఈరోజు సాక్షిలో రాష్ట్ర వ్యాప్తంగా అరలక్ష బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఒక బ్యానర్ ఐటెం ప్రచురించింది. ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో క‌లిపి మొత్తం 50,751 పడకలు ఖాళీగా ఉన్నాయి… ఎవరికి బెడ్ కావాలన్నా నిముషాల్లో బెడ్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించడంతో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారంటూ ఏదేదో రాసేసింది.

అయితే పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఒక్క సోషల్ మీడియాలోనే బెడ్ కావాలి అంటూ దీనంగా ఎదురుచూస్తున్న వారి సంఖ్య వందలలో ఉంటుంది. ఇక్కడ ఇతర టీవీ ఛానెళ్లలో విజ‌య‌వాడ జీజీహెచ్ ఆస్ప‌త్రి ఎదుట క్యూ కట్టిన ఆరు అంబులెన్స్‌ల విజువ‌ల్స్ చూపించడం గమనార్హం. ఆ మాటకు వస్తే ఏపీలోని ఏ ఆసుపత్రిలోనైనా ఇదే పరిస్థితి.

లక్షలు గుమ్మరిస్తే గానీ బెడ్ దొరకని పరిస్థితి… బెడ్ దొరికితే ఆక్సిజన్, మందుల కోసం కోవిడ్ ను కూడా లెక్క చెయ్యకుండా వారి బంధువులు కాలికి బలపం కట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. ఇది ఇలా ఉండగా… ప్రజలను పరిస్థితి బాలేదు అంటూ భయపెడితే ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని అధికారాలు బెదిరించడం ఇంకో దారుణం.