Amit Shah -Chandrababuసాక్షి పత్రిక తీరే వేరుగా ఉంటుంది. 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్లీ ఎన్డీయే గూటికే చేరనుందా..? ఈ మేరకు బీజేపీ అధిష్టానానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రత్యేక ‘మిత్రుల’ ద్వారా సమాచారం చేరవేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోందని ఆ పత్రిక ఒక కధనం ఇచ్చింది.

ఎన్నికల తర్వాత బీజేపీ కూటమిలో చేరతామని, అయితే ఎన్నికలకు ముందు మాత్రం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌తోపాటు, ఇతర పక్షాల సహకారం అవసరమని కూడా చంద్రబాబు బీజేపీ పెద్దలకు తెలియజేసినట్టు సమాచారం అని వారు చెప్పుకొచ్చారు. ఇదంతా బానే ఉంది అదే నిజం అనుకుందాం.

టీడీపీ బీజేపీ ఇలా చీకటి ఒప్పందాలు చేసుకుంటుంటే వైకాపా బీజేపీతో ఎందుకు అంటకాగుతున్నట్టు? ఇటీవలే రాజ్యసభ ఉప ఛైర్మన్ ఎన్నికలో కూడా ఆ పార్టీ ఎంపీలు ఓటింగును బహిష్కరించి ఎన్డీయే అభ్యర్ధికి పరోక్షంగా మద్దతు ఇచ్చారు. అన్ని రకాలుగానూ బీజేపీకి మద్దతు ఇచ్చి టీడీపీకు వారికి రహస్య ఒప్పందం వుందంటే ఎవరైనా నమ్ముతారా?