Sakshi news allegations on kodela siva prasad raoప్రభుత్వ కక్షసాధింపు చర్యల వల్లే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు బలవన్మరణానికి పాల్పడ్డారనే అభిప్రాయం ప్రజలలో బలంగా ఉంది.దీనితో అధికార పార్టీకి ఇబ్బంది కలుగవచ్చాని మూకుమ్మడిగా దాడి మొదలుపెట్టింది సాక్షి. విదేశాల్లో ఉన్న కొడుకు తో ముందు రోజు రాత్రి గొడవ పడి కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఒక కథ అల్లింది. ఆయన దేశంలోనే లేకపోవడంతో చంద్రబాబు పట్టించుకోలేదు, టీడీపీ నుండి సస్పెండ్ చేద్దామని చూశారు అంటూ మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టించారు.

ఇప్పుడు తాజాగా దానికోసం వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించే ఒక బీజేపీ చోటా నాయకుడిని రంగంలోకి దిగింది. టీడీపీ మీద కోడెల తీవ్ర మనస్తాపంతో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేసింది. “నెల రోజుల క్రితం కోడెల నాకు ఫోన్‌ చేసి సుదీర్ఘంగా మాట్లాడారు. అమిత్‌ షాని కలువాలని నాతో చెప్పారు. దీంతో హైకమాండ్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాను. సమయం చూసుకొని ఢిల్లీకి వచ్చి బీజేపీ పెద్దలతో కలుస్తాననని కోడెల చెప్పారు. అందుకు నేను సరే సర్‌ అని చెప్పాను,” అని అతనితో చెప్పించారు.

“టీడీపీ అధినాయకత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరును కోడెల జీర్ణించుకోలేకపోయారు. సన్‌ స్ట్రోక్‌ కూడా ఇబ్బంది పెట్టింది. రూపాయి ఆశించకుండా వైద్యం చేసిన వ్యక్తి.. తన పిల్లల మీద, తన మీద ఆరోపణలు రావడంతో బాధపడ్డారు. ఈ కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా కోడెలకు అండగా నిలబడలేదు. అందుకే ఈ పనికి పాల్పడ్డారు,” అని చెప్పుకొచ్చారు. టీడీపీ పెట్టిన నాటి నుండి ఉన్న నాయకుడు కోడెల. అటువంటి నేత టీడీపీలోకి వెళ్ళాలి అనుకుంటే తన స్థాయి నాయకులతో మాట్లాడతారు గానీ కనీసం వార్డు మెంబెర్ కూడా కాని నాయకుడితో మాట్లాడతారా?

అదే సమయంలో ఎన్నికల అనంతరం జరిగిన చాలా టీడీపీ సమావేశాలకు కోడెల హాజరు అయ్యారు. ఆ వీడియోలు, ఫోటోలు కూడా మీడియాలో వచ్చారు. తాజాగా ఆయన ఆసుపత్రి పాలైతే టీడీపీ కీలక నాయకులు వెళ్లి పరామర్శించి వచ్చారు. చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారని కూడా వార్తలు వచ్చాయి. పోనీ ఆయన గతించాకా కూడా ఆయన కుటుంబసభ్యులు ఎవరూ టీడీపీని విమర్శించలేదు. ఎటునుంచి ప్రభుత్వమే ఆత్మహత్యకు ప్రేరేపించింది అని కేసు పెట్టారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామన్నా ఒప్పుకోలేదు. మరి టీడీపీకి మకిలి అంటించాలని సాక్షి తాపత్రయం ఏంటో? తప్పు చెయ్యకపోతే కోడెల వ్యవహారంలో సాక్షికి అంత ఆరాటం ఎందుకు? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.