sakshi-cooking-story-on-chandrababu-ramoji-rao-meetఎన్నికలు అయిపోయినా అనేక పనులతో బిజీ బిజీగా గడుపుతున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన ఉన్నఫళంగా హెలికాప్టర్ పై అమరావతి నుండి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీ రావుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారని వార్తలు వచ్చినా దానికి ఎటువంటి ఆధారాలు మీడియాకు చిక్క లేదు. వీరిద్దరి భేటీ దాదాపుగా మూడు గంటల పాటు సాగిందని సమాచారం. రామోజీ ఫిలిం సిటీలోనికి మీడియాకు అనుమతి ఉండదు.

రామోజీ రావు దగ్గర నుండి విషయాన్నీ లీక్ చేసే అవకాశం కూడా ఉండదు. కావున లోపల ఏం జరిగిందనేది తెలియడం అసాధ్యం. అయితే సాక్షి మాత్రం లోపల ఏం జరిగింది అనేదాని పై ఈరోజు ఉదయమే వేడి వేడిగా వండి వార్చింది. టీవీ9 వివాదం రవిప్రకాష్ అరెస్టుకు దారి తీయడంతో చంద్రబాబు ఆయనని కాపాడుకోవడానికి రామోజీ రావు దగ్గరకు పరిగెత్తారని, తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడాలని, టీవీ9 కొత్త యాజమాన్యాన్ని వెనుకడుగు వేసేలా చెయ్యాలని చంద్రబాబు కోరారట.

అలాగే ఎన్డీయే నుంచి బయటకు రావడంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని రామోజీరావు అభిప్రాయపడినట్లు…మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే కలిసిపోవడమే మంచిదనే అభిప్రాయం రామోజీరావు, చంద్రబాబుల మధ్య చర్చల్లో వ్యక్తమైనట్లు సాక్షి చెప్పుకొచ్చింది. లోపల ఏం జరిగినా సాక్షి ఎప్పటిలానే తన ఎజెండాకి తగట్టు పులిహోర వండి వార్చేసిందని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. ఎలాగూ చంద్రబాబు, రామోజీ రావు బయటకు వచ్చి దీనిని ఖండించారు. దీనితో సాక్షికి అడ్డూ ఆపు లేకుండా పోయింది.