Team India Vs Bangladesh T20ఇటీవల ముగిసిన ఉత్కంఠకరమైన మ్యాచ్ లో ఒక పరుగు తేడాతో బంగ్లాదేశ్ పై భారత్ జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో ప్రకారం అయితే… భారత్ పై బంగ్లాదేశ్ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంతకీ ఆ వీడియో ఏంటి… ఏ మీడియా సంస్థ ప్రసారం చేసిందో తెలుసుకోవాలని ఉందా..!

మీడియా సంస్థలకు ప్రధానంగా ఉండాల్సిన క్రెడిబులీటీ తమకు లేదు అని చాటిచెప్పే విధంగా సాక్షి మీడియా సంస్థ చూపిన అత్యుత్సాహానికి నిదర్శనం ఇది. 3 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ ఖచ్చితంగా గెలిచేస్తుందని అంచనా వేసి ముందుగానే ప్రసారం చేసిన సాక్షి మీడియా నైతికతపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఒక్క తెలుగుదేశం పార్టీని విమర్శించే సమయంలోనే కాస్త అత్యుత్సాహం చూపుతుందని భావించిన వారి అభిప్రాయాలు తప్పనే విధంగా అన్నింటిలోనూ తప్పుడు కధనాలకు నిలయంగా నిలుస్తోంది ‘సాక్షి’ మీడియా సంస్థ. ఈ తీరుపై అటు క్రికెట్ అభిమానులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక, ఈ పత్రికలో ప్రచురించే కధనాలకు పాఠకులు ఎంతటి ప్రాముఖ్యత ఇవ్వాలో వారే నిర్ణయించుకోవాలి.

What more can you expect from a TV channel

What more can you expect from a TV channel that spreads baseless rumours and blatant lies?#SakshiAntiIndia #SakshiLies

Posted by Telugu Desam Party (TDP) on Friday, March 25, 2016