Sajjanar Kumar - Disha case encounter-దిశ నిందితులు ఈరోజు తెల్లవారు జామున ఎన్కౌంటర్ చేయబడ్డారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. సరిగ్గా ఏ అండర్ పాస్ కింద అయితే దిశను తగలబెట్టారో అక్కడే ఇప్పుడు ఎన్కౌంటర్ జరగడం గమనార్హం.

2008లో తెలంగాణాలో ఇటువంటి ఎన్కౌంటరే జరిగింది. అప్పుడు ఇద్దరి ఇంజనీరింగ్ విద్యార్థినుల మీద తమ ప్రేమను ఒప్పుకోలేదని ముగ్గురు కలిసి యాసిడ్ దాడికి పాల్పడ్డారు. అప్పుడు కూడా ఇప్పటిలానే పెద్ద ఎత్తున పబ్లిక్ నిరసన వచ్చింది. అప్పుడు కూడా వారు ఎన్కౌంటర్ చెయ్యబడ్డారు.

అప్పుడు కూడా సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం తీసుకుని వెళ్తుంటే వారు తప్పించుకోబోయారు అని పోలీసులు చెప్పారు. పోలీసుల మీద రాళ్ల తో దాడి చెయ్యగా, ఆత్మరక్షణలో భాగంగా వారిని ఎన్కౌంటర్ చేశారని రికార్డులలో ఉంది. అయితే ఎన్కౌంటర్ చేసిన విధానమే కాదు. వ్యక్తి కూడా ఒకరే.

అప్పుడు ఎన్కౌంటర్ సమయంలో వరంగల్ ఎస్పీ గా ఉన్న వీసీ సజ్జనార్ ఇప్పుడు సైబరాబాద్ పోలీసు కమీషనర్ గా ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే సజ్జనార్ ను హీరోగా కీర్తిస్తున్నారు. కొందరు ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని వాదిస్తుంటే కొందరు ఇదే సహజమైన న్యాయం అంటున్నారు.