Sajjala Ramakrishna Reddy comments on chandrababu naidu“హైదరాబాద్ లో అదేదో రౌండ్ గా కట్టారంటూ” చంద్రబాబును ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ చేసిన ఎటకారపు వ్యాఖ్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన డిబేట్ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు వెంకట కృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘హైదరాబాద్ లో అదేదో రౌండ్ గా కట్టావ్, నువ్వు అంతమించి చేసిందేమి లేదంటే… అవునులే… మీకు తెలియకపోవచ్చు గానీ, ఒక బిల్ గేట్స్ నో, ఒక విప్రో ప్రేమ్ జీనో, ఒక ఇన్ఫోసిస్ నారాయణ మూర్తినో లేకపోతే బిల్ క్లింటన్ నో ఇలాంటి వాళ్ళ స్థాయిలో తెలుస్తుంది హైదరాబాద్ లో ఆనాడు జరిగిన అభివృద్ధి.

లేకపోతే చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని కొనసాగించిన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారికో, ఇపుడు పనిచేస్తోన్న కేసీఆర్, కేటీఆర్ గారాలకో తెలుస్తాయి ఆనాడు జరిగిన పునాదులు గురించి, డెవలప్మెంట్ గురించి, మీకేం తెలుస్తుంది?

మీరు ఇక్కడ్నుంచి వెళ్ళిపోయి అక్కడేదో చెడకొట్టే పనిలో ఉన్నారు కదా! మీ దృష్టిలో అభివృద్ధి అంటే కూల్చేయడం, అది ఎవ్వరూ చేయలేదు ఇప్పటివరకు ఉన్న ముఖ్యమంత్రులెవ్వరూ! అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలను ఏకరువు పెట్టారు.

17 వేల కోట్ల ప్రాజెక్ట్ రాకుండా చేసారని చంద్రబాబు చేసిన విమర్శలపై స్పందించిన సజ్జల, 17 వేల కోట్లు మీ అక్క ఎక్కడ్నుంచి తెచ్చిపెడతారంటూ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన చంద్రబాబుపై విమర్శలు చేయడం తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి కారణమవుతోంది.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముద్దుగా పిలుచుకునే సకల శాఖామంత్రి సజ్జల అనేక ఆరోపణలు టిడిపి అధినేతపై గుప్పించారు. గత టిడిపి పాలనంతా దౌర్భాగ్యపు పాలన అని, నాడు చంద్రన్న వేసిన గుంతలను నేడు జగనన్న పూడుస్తున్నారని ఈ సకల శాఖామంత్రి గారు విమర్శించారు.