వైఎస్ సన్నిహితుడు జగన్ కంటే కాంగ్రెస్సే బెటర్ అనుకున్నారా?

Sai Prathap Annayyagari resignation from TDPకేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ ఎన్నికల ముంగిట టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో రాజంపేట లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించిన సాయి ప్రతాప్.. కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి బాగా సన్నిహితుడైన సాయి ప్రతాప్ అనూహ్యంగా టీడీపీలో చేరారు. అయితే అక్కడ ఆయన ఇమడలేకపోతున్నారు అనే మాట తరచూ వినిపిస్తుంది. దానికి తోడు ఆయన పార్టీలో పెద్దగా యాక్టీవ్ గా ఉన్నది కూడా లేదు.

తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో 2014 తరువాత అనూహ్యంగా బలపడిందని ఆ పార్టీ వారి అభిప్రాయం. వైఎస్సార్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న జిల్లాలోని 10 స్థానాలలో నాలుగు గెలుస్తామని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. జిల్లాలోని జమ్మలమడుగు, కమలాపురం, రాజంపేట, రైల్వేకోడూరు గెలుస్తామని వారు అంటున్నారు. రాజంపేట ఎంపీ స్థానం కూడా టీడీపీ గట్టి పోటీనే ఇవ్వబోతుందని అనుకున్న తరుణంలో సాయి ప్రతాప్ చంద్రబాబుకు దెబ్బేశారు. దీనితో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమని అంతా అనుకున్నారు. . \

అయితే ఆయన అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరకుండా ఎన్నికలలో తటస్థంగా ఉండిపోయారు. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అధికారంలోకి వచ్చే రెండు పార్టీలనూ కాదని ఆయన మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్లడం విశేషమనే చెప్పుకోవాలి. పైగా రాజంపేటలో పార్టీకి పూర్వవైభవం తెస్తా అని చెప్పుకొస్తున్నారు. ఎంత అనుభవం ఉంటే మాత్రం ఏం లాభం? రాజకీయాలలో హత్యలు ఉండవ్ అన్నీ ఆత్మహత్యలే..

Follow @mirchi9 for more User Comments
Balakrishna's-Hindupur-Victory-is-Not-As-Simple-As---it-AppearsDon't MissBalayya's Victory is Not As Simple As it AppearsTelugu Desam Party has ended with a humiliating loss in the just concluded Elections. The...Don't MissIs It Correct to Blame Pawan Kalyan for TDP's Loss?Telugu Desam Party has ended with a humiliating loss in the just concluded Elections. Pawan...YS-Jagan's-Plan-To-Decimate--TDPDon't MissJagan's Plan To Decimate TDPTelugu Desam Party has faced its worst-ever defeat by winning just 23 out of the...Allu-Arjun-Attends-Asst.-Choreographer-Sirish's-Wedding-(1)Don't MissAllu Arjun Attends Asst. Choreographer Sirish's WeddingAllu Arjun Attends Asst. Choreographer Sirish's WeddingDon't MissDon't Know Where It Came from - Saaho DirectorResponding to the rumour that Bollywood superstar Salman Khan might be making a cameo appearance...
Mirchi9