Sai Pallavi Signs Web Seriesట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి సినిమాలలో బాగా బిజీగా ఉండగానే డిజిటల్ మీడియా వైపు అడుగులు వేస్తుంది. నెట్ ఫ్లిక్స్ కు సంబంధించిన ఒక వెబ్ సిరీస్ ను ఆమె ఒప్పుకున్నట్టు సమాచారం. తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడట.

వెట్రిమారన్ ఇటీవలే ధనుష్ తో అసురన్ అనే సినిమా తీసి సెన్సేషన్ సృష్టించాడు. ప్రకాష్ అసురన్ లో ఒక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చెయ్యబోతున్నారు. ఆయననే ఈ సినిమాకు తీసుకోవాలని అనుకున్నా అందుకు ఆయన నో చెప్పారట. భాష ఇబ్బంది వల్ల ఈ సినిమా నేను చెయ్యలేను అని ఆయన చెప్పేశారట.

ఇది ఇలా ఉండగా ఈ వెబ్ సిరీస్ కు మరో ముగ్గురు దర్శకులు కూడా పని చేస్తున్నారు. సుధా కొంగర, విగ్నేష్ శివన్, గౌతమ్ మీనన్ ఈ సినిమా కోసం పని చెయ్యబోతున్నారు.  విగ్నేష్ శివన్ షూట్ చేసే ఎపిసోడ్లు ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిపోయాయి. ఆ భాగాలలో అంజలి, కల్కి నటించారు.
ఇది ఇలా ఉండగా సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. రానాతో విరాటపర్వం అనే సినిమా చేస్తుంది. అలాగే నాగచైతన్యతో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఇంకో సినిమా చేస్తుంది. ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.