Sai manjrekar to romance varun tej  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా సినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. ‘తొలిప్రేమ’ సినిమాతో 30 కోట్ల క్లబ్ లో చేరిన వరుణ్, ‘ఫిదా’ సినిమాతో 50 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా నిలిచాడు. ఆ తరువాత ఎఫ్ 2 తో 80 కోట్ల క్లబ్ లో చేరారు. వరుస హిట్లతో ఆయన వెనుతిరిగి చూసుకునే అవకాశమే లేదు. తాజాగా వరుణ్ తేజ్ తర్వాతి సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమాకు హీరోయిన్ కంఫర్మ్ కాలేదు. వారానికి ఒక హీరోయిన్ పేరు వినపడుతుంది. తాజాగా వినపడుతున్న పేరు … దబాంగ్ 3 తో సినిమాలకు పరిచయమైన శాయి మంజ్రేకర్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి చర్చలు జరుపుతున్నారట.

కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, అల్లు బాబీ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. వరుణ్ నటించబోతున్న పదో సినిమా ఇది. గద్దలకొండ గణేష్ సినిమాలో ఊర మాస్‌గా కనిపించిన వరుణ్ ఇప్పుడు బాక్సర్‌గా ఎలా ఉంటారో చూడాలి.

ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సినిమాకు సంగీతం అందిస్తారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ తండ్రిపాత్రలో మాధవన్ నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించనుంది. ఈ సినిమా స్టోరీ ప్రకారం తండ్రి మంచి బాక్సర్. అతను బాక్సర్‌గా సాధించలేనిది.. తన కొడుకుతో ఎలా తన తీరని కోరికను ఎలా నెరవేర్చుకున్నాడనేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు.