Tikka Movie, Tikka Movie Item Song, Sai Dharam Tej Tikka Movie Item Song, Tikka Movie Item Song Dirty Picture,  Tikka Movie Item Song Girlఇటీవల కాలంలో ఐటెం సాంగ్స్ హిట్ అయిన దాఖలాలు చాలా అరుదు. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు దాదాపుగా 80 శాతం సినిమాలలో ఉంటున్న ఐటెం సాంగ్స్ కు ఆదరణ కరువవుతోంది. ఫలానా సంగీత దర్శకుడి నుండి వస్తోంది అంటే… భారీ అంచనాలు పెట్టుకోవడం సంగీత ప్రియుల వంతవుతుంటే… ఆ అంచనాలను అందుకోలేకపోవడం సంగీత దర్శకుల వంతవుతోంది.

ఒక రకంగా చెప్పాలంటే… ‘దూకుడు’ సినిమాలో ‘ఆటో అప్పారావు’ అంటూ పార్వతి మెల్టన్ ఊపిన ఊపు తర్వాత, ఆ రేంజ్ లో మరే ఐటెం సాంగ్ హిట్ కాలేదు. ‘ఆగడు, సర్ధార్ గబ్బర్ సింగ్’ ఐటెం సాంగ్స్ పర్వాలేదనిపించినప్పటికీ, అంచనాలను మాత్రం అందుకోలేకపోయాయి. అయితే ఆ లోటును తాజాగా విడుదలైన “తిక్క” సినిమాలో ఐటెం సాంగ్ తీర్చేదిలా కనపడుతోంది. ప్రస్తుతం ఈ పాట సంగీత ప్రియులను అలరించడంతో పాటు, మాస్ వర్గాలను ఒక ఊపు ఊపుతోంది.

‘డర్టీ పిక్చర్… డర్టీ పిక్చర్…’ అంటూ సాగే ఈ పాటలో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. ‘దూకుడు’ సినిమాలో అందించిన ఆ ఓల్డ్ స్టైల్ సంగీతం, మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఈ ‘తిక్క’ పాటలో వినపడుతోంది. ఉషా ఉతుప్, సింహాలు ఆలపించిన ఈ పాట 2016 బెస్ట్ ఐటెం సాంగ్స్ జాబితాలో ఒకటిగా నిలిచిపోవడం ఖాయం. ఈ ‘తిక్క’ ఆడియోతో మరోసారి థమన్ స్వరాలు చార్ట్ బస్టర్స్ లో మారుమ్రోగుతున్నాయి.