sai dharam tej rashi khanna selfie in supreme shootingప్రపంచాన్నంతా ఊపెస్తున్న సెల్ఫీ ఫోటోలు సెలబ్రిటీలకు కూడా ఓ క్రేజ్ గా మారిపోయింది. హాలీవుడ్, బాలీవుడ్ ముద్దుగుమ్మలైతే ఇప్పటికే ఈ ‘సెల్ఫీ’లతో సోషల్ మీడియాలో హల్చల్ చేయగా, ఇటీవల తెలుగు సినిమాల్లో నటిస్తున్న హీరో, హీరోయిన్లు కూడా ఈ ‘సెల్ఫీ’ల బాట పట్టారు. తాజాగా ఈ జాబితాలో మెగాహీరో సాయిధరంతేజ్, హీరోయిన్ రాశిఖన్నాలు చేరారు. వీరిద్దరూ కలిసి దిగిన ‘సెల్ఫీ’ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

చిలిపి నవ్వుల ఫోటోకు తోడు ఇద్దరూ నాలుకలు బయటపెట్టి హాట్ హాట్ హావభావాలతో కూడిన ఫోటోను చూస్తూ సోషల్ మీడియాలో ‘వివిధ’ రకాలైన కామెంట్లు వేస్తున్నారు. ఇంతకీ ఈ సన్నివేశం ఎక్కడ జరిగిందంటే… రాజస్థాన్ లోని జైసల్మేర్ లో! ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న “సుప్రీమ్” చిత్ర షూటింగ్ లో భాగంగా సరదాగా చోటు చేసుకున్న ఫోటో ఇది. ‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు.