Sachin Tendulkar with son Arjun‘ఇండియన్ క్రికెట్ గాడ్’ సచిన్ రమేశ్ టెండూల్కర్ జీవిత చరిత్రపై ‘సచిన్ – ఎ బిలియన్ డ్రీమ్స్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ సచిన్ అభిమానులతో పాటు సినీ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సచిన్ బాల్యంలో పాత్రను ధరించే బాలుడి కోసం చిత్ర బృందం చాలా మందిని పరిశీలించినా, సచిన్ పోలికలు కలిగిన జూనియర్ ‘మాస్టర్ బ్లాస్టర్’ బాలుడు దొరకలేదు.

దీంతో ఈ చిత్ర బృందం సచిన్ బాల్యంలో పాత్ర కోసం అసలైన వ్యక్తిని సచిన్ నే సంప్రదించింది. సచిన్ పాత్రను తనయుడు అర్జున్ టెండూల్కర్ కంటే బాగా ఎవరు వేయగలరని భావించిన చిత్ర బృందం, సచిన్ తో ఈ వ్యాఖ్య చెప్పడం, వెంటనే అర్జున్ తో సచిన్ బాల్యానికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేయడం జరిగిపోయింది. మొత్తానికి ఈ సినిమాలో సచిన్ తో పాటు ఆయన తనయుడు కూడా సందడి చేయడం అభిమానులకు బోనస్ లాంటిదే కదా!