sachin-tendulkar-shane-warne-all stars cricketక్రికెట్ దిగ్గజాలంతా కలిసి అమెరికా వేదికగా ఆడుతున్న “ఆల్ స్టార్స్ క్రికెట్” కన్నులవిందుగా సాగుతోంది. తొలి టి 20 మ్యాచ్ను వార్న్ వారియర్స్ కైవసం చేసుకోవడంతో రెండవ మ్యాచ్లో సచిన్ సేనపై ఒత్తిడి నెలకొంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సచిన్ టీంకు వార్న్ సేన చుక్కలు చూపించారు, బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో 20 ఓవర్లలో ఏకంగా 262 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేయగలిగారు. వాన్ 30, హేడెన్ 32, కల్లిస్ 45, సంగకర్ర 70, పాంటింగ్ 41 పరుగులు చేసి ఔట్ కాగా, సైమండ్స్ 19, జాంటీ రోడ్స్ 18 పరుగులతో నాటౌట్గా నిలిచారు.

భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సచిన్ సేన మొదట్నుంచే చేతులెత్తేశారు. ప్రధాన బాట్స్‌మెన్లు సెహ్వాగ్ 16, సచిన్ 33, గంగూలీ 12, లారా 19, జయవర్ధనే 5, క్లూసెనర్ 21 పరుగులు మాత్రమే చేయడంతో ఏ దశలోనూ సచిన్ టీమ్ పోరాట పటిమను ప్రదర్శించలేకపోయింది. పొల్లాక్ ఒక్కడే 22 బంతుల్లో 55 పరుగులు చేయడంతో 200 పరుగుల మైలు రాయిని దాటి 205 పరుగులు చేసింది. అయితే మ్యాచ్లు సాగుతున్న విధానం, ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణతో నిర్వాహకులు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా క్రికెట్ను ఎలిన మహామహులంతా ఒక్క చోట కలుసుకోవడం, ఎంజాయ్ చేయడం, వీక్షకులకు కన్నుల పండుగగా ఉంటోంది. తొలి రెండు మ్యాచ్లను నెగ్గి సిరీస్ను ఇప్పటికే సొంతం చేసుకున్న వార్న్ సేనతో ఈ నెల 14వ తేదీన చివరి మ్యాచ్ ఆడనుంది సచిన్ టీమ్.