saamy-trailer-talk-loud-and-borderline-obnoxious“యముడు” సినిమాలో హీరో సూర్యను కాకుండా మరో హీరోను ఊహించుకుంటే ఎలా ఉంటుంది? బహుశా ప్రేక్షకులకు ఎలా ఉంటుందో తెలియచెప్పడానికే దర్శకుడు హరి, తాజాగా చిత్రం “సామి”ని విక్రమ్ తో తెరకెక్కించినట్లుగా కనపడుతోంది. ‘యముడు’ సీక్వెల్స్ లో సూర్య చేసిన సన్నివేశాలను విక్రమ్ చేస్తే ఎలా ఉంటుందో, ఈ సినిమా ట్రైలర్ చెప్తోంది.

విక్రమ్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. దర్శకుడు హరి టేకింగ్… దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్… అవే అరుపులు… అవే కొట్టుడు… ఇలా మొత్తంగా ‘సామి’పై ఏ మాత్రం ఆసక్తిని పెంచని విధంగా ఈ ట్రైలర్ ను కట్ చేసారు. అందులోనూ రెండు నిముషాల పాటు నిడివి ఉండడం మరో మైనస్.