Saamy Square Trailer Talk-పోలీస్ కధలను వినూత్నంగా అందించడంలో దర్శకుడు హరి సిద్ధహస్తుడన్న విషయం తెలిసిందే. నాడు విక్రమ్ తో తీసిన ‘సామి’ నుండి సూర్యతో తెరకెక్కించిన ‘సింగం’ సినిమాల వరకు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించిన హరి, తాజాగా విక్రమ్ తో “సామి 2″ను తయారు చేసారు. ‘సామి’ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో, ఈ సీక్వెల్ పై అంచనాలు బాగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

ట్రైలర్ ఆద్యంతం ‘సింగం’ సినిమా పోలీకలు, విజువల్ ఎఫ్ఫెక్ట్స్ కనిపించాయి తప్ప, ‘సామి’ సినిమాలో ఛాయలు మిస్ అయ్యాయి. ఎలాంటి పాత్రలకైనా న్యాయం చేసే విక్రమ్, పోలీస్ రోల్ కు న్యాయం చేసారు గానీ, విక్రమ్ ను చూస్తుంటే సూర్య గుర్తుకు వచ్చేలా హరి తెరకెక్కించడం మాత్రం ఊహించని అంశం. ‘సింగం’ సినిమాలను రేసీ స్క్రీన్ ప్లే తో నడిపించే హరి, ఈ ట్రైలర్ ను కూడా యాక్షన్ సన్నివేశాలతో నింపేసారు. వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తోన్న విక్రమ్ కు ఇది కొత్తగా ఉండొచ్చు గానీ, వీక్షకులకు మాత్రం ‘సామి సింగం’లా మారినట్టుంది అనుకుంటున్నారు.