Saakshyam US Premiers Cancelled‘లక్ష్యం’ ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన “సాక్ష్యం” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పంచభూతాల కాన్సెప్ట్ కు కమర్షియల్ హంగులు హద్దుతూ శ్రీవాస్ తీర్చిదిద్దిన విధానం బాగానే ఉంది గానీ, దానికి తగ్గ ఎమోషన్ తెరపై సరిగ్గా ప్రతిబింబించడంలో బెల్లంకొండ వారబ్బాయి నూటికి నూరు శాతం మార్కులు పొందలేకపోయాడు.

ఈ కాన్సెప్ట్ ఏదైనా పెద్ద హీరో చేస్తే సినిమా సక్సెస్ రేటుతో పాటు, కాన్సెప్ట్ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యి ఉండేది. అయితే కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని చొప్పించిన పాటలు మాత్రం సినిమాకు స్పీడ్ బ్రేకర్లులా మారాయి. ఫైట్ల సందర్భంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ‘శివం శివం… హరం హరం…’ అన్నది ఎంత అద్భుతంగా ఉంటుందో, మెలోడీ ఒకటి మినహాయిస్తే మిగతావన్నీ పేలవంగా ఉన్నాయి.

ముఖ్యంగా తెలుగు నేటివిటికి అనుగుణంగా పాటలను అందించడంలో హర్షవర్ధన్ రామేశ్వర్ విఫలం కాగా, బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం సత్తా చాటాడు. గ్లామరస్ హీరోయిన్ గా పేరుబడ్డ పూజా హెగ్డేను సంప్రదాయ కోణంలో చూపించడం బహుశా ఆమెకు ఫ్రెష్ గా అనిపించవచ్చు. సినిమాలో ఫస్ట్ ఎపిసోడ్ ను రక్తికట్టించడంలో సక్సెస్ అయిన శ్రీవాస్, అదే టెంపోను యాక్షన్ సన్నివేశాలలో పూర్తిస్థాయిలో పండించకపోవడం మైనస్.