మాస్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడన్న సంకేతాలను “సాక్ష్యం” సినిమా ఓపెనింగ్స్ చెప్తున్నాయి. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. గత సినిమాలన్నీ స్టార్ డైరెక్టర్లతో చేయడంతో, ఆ ఓపెనింగ్స్ వారి ఖాతాలోకి వెళ్ళిపోగా, ఈ ‘సాక్ష్యం’ క్రెడిట్ లో ఎక్కువ శాతం బెల్లంకొండ ఖాతాలోకి వెళ్ళింది.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా శ్రీవాస్ కు ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్నప్పటికీ, ప్రేక్షకులలో స్టార్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు అయితే లేదన్నది బహిరంగమే. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో బెల్లంకొండ సినిమాకు బ్రహ్మరధం పట్టడం విశేషం. తొలిరోజు ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు వ్యక్తం కాగా, సినీ విశ్లేషణలు కూడా ‘సాక్ష్యం’ అనుకూలంగా రాలేదు. దీంతో ఈ వీకెండ్ ఎంత కొల్లగోడుతుంది అన్న దానిపై ‘సాక్ష్యం’ రికవరీ ఆధారపడి ఉంది.