Saaho--Ye-Chota-Nuvvunna-Song-Teaserరిలీజ్ డేట్ సమీపిస్తుండడంతో సాహో బృందం తమ ప్రమోషన్ల వేడి పెంచింది. దీనిలో భాగంగా సినిమాలోని రొమాంటిక్‌ గీతం టీజర్‌ విడుదలైంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ పాట టీజర్‌ను విడుదల చేశారు. మంచు కొండల్లో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌పై ఈ పాటను చిత్రీకరించారు. హరిచరణ్‌ శేషాద్రి, తులసీ కుమార్‌ ఈ గీతాన్ని ఆలపించారు. కృష్ణ కాంత్‌ సాహిత్యం అందించారు. ‘నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే.. నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే..’ అంటూ సాగే ఈ గీతం పూర్తి వీడియో టీం తొందరలో విడుదల చేస్తుంది.

పాట మొదట్లో వచ్చే మ్యూజిక్ బిట్ బావుంది. విజువల్స్ అదిరిపోయాయి. ప్రభాస్ లుక్ కూడా సూపర్బ్ అనిపించేలా ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ పాట టీజర్ కన్నులవిందుగా ఉంది. అయితే పాట ఒక లైన్ కూడా పూర్తిగా లేకపోవడంతో పాట గురించి ఒక అభిప్రాయానికి రావడం ఇప్పుడే కుదరదు. ఆగష్టు రెండవ భాగం నుండి వివిధ రాష్ట్రాలలో సినిమాకు సంబంధించిన వేడుకలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొదటి ఈవెంట్ తెలుగులోనే ఉంటుంది. బెంగళూరు, కొచ్చి, చెన్నై, ముంబైలలో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.

300 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై దేశవ్యాప్తంగా ట్రేడ్, ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా 30కి వాయిదా పడింది. బాహుబలి మాదిరిగానే నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది.