Saaho-Early-Advance-Booking-Report-–-Sensational-And-Shockingయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. థియేట్రికల్ ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో అన్ని భాషల్లోనూ సినిమా మీద హైప్ విపరీతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో సెన్సషనల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు చిత్ర పంపిణీదారులు. అయితే అమెరికాలో మాత్రం పంపిణీదారు వ్యూహం బెడిసికొట్టేలా ఉంది.

తమిళ ప్రీమియర్లకు 20 డాలర్ల టికెట్ రేటు, హిందీ ప్రీమియర్లకు 25 డాలర్లు నిర్ణయించారు. అయితే ఆయా భాషల ఆడియన్స్ కు ఇవి కనీవినీ ఎరుగని రేట్లు. ఎప్పుడో రజినీకాంత్ సినిమాలకు తప్ప తమిళ తంబీలకు 20 డాలర్ల రేటు ఉండదు. హిందీ ఆడియన్స్ కి అయితే అక్కడి సూపర్ స్టార్ల సినిమాలు కూడా 10 డాలర్లకు మించదు. బాగా ఎక్కువ అనుకుంటే 12 డాలర్లు అది కూడా ఎప్పుడో రేర్ గా. ఈ తరుణంలో 25 డాలర్లు అంటే వారూ ముందుకు రావడం లేదు.

దీనితో ఆయా థియేటర్లలో బుకింగ్స్ అసలు బాలేదు. భారీగా సొమ్ము పెట్టి కొన్న పంపిణీదారు ఇప్పుడు రిస్క్ లో పడ్డాడు. అలాగని ఆయా భాషలకు రేట్లు తగ్గిస్తే తెలుగు ఆడియన్స్ అటు తరలిపోతారేమో అని భయం. దీనితో ముందు నుయ్యి వెనుక గొయ్యి లా ఉంది వారి పరిస్థితి. తెలుగు వెర్షన్ కు అటుఇటుగా సమానంగా మిగిలిన రెండు వెర్షన్లు విడుదల చేస్తున్నారు. ఏ మాత్రం టాక్ తేడా వచ్చినా ఇబ్బందే అని ట్రేడ్ కంగారు పడుతుంది. చూడాలి 30న ఏం జరగబోతుంది అనేది!