Saaho Movie Pre Climax fight costs 80 croresయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో అన్ని భాషల్లోనూ సినిమా మీద హైప్ విపరీతంగా ఉంది. సినిమాకు ఏ మాత్రం మంచి టాక్ వచ్చినా బాహుబలి 2 రేంజ్ హిట్ కావడం ఖాయం అంటున్నారు. అయితే సినిమా అన్ని భాషలలో కలిపి కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే 290 కోట్లు రాబట్టింది.

వీటితో పాటు సాటిలైట్, మ్యూజిక్, డిజిటల్, ఇంటర్నేషనల్ రైట్స్, ఇతర హక్కుల నుండి వచ్చిన ఎమౌంట్ అంతా కలిపి ప్రీ-రిలీజ్ బిజినెస్ 500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ప్రీ-రిలీజ్ బిజినెస్ వరకూ చూసుకుంటే దేశంలోనే మూడవ అతిపెద్ద ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసిన చిత్రం ఇదే. గతంలో బాహుబలి 2, రజినీకాంత్ 2.0 మాత్రమే ఎక్కువ ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. కేవలం ప్రభాస్ అనే పేరు మీద జరిగిన బిజినెస్ ఇది అనడంలో అతిశయోక్తి లేదు.

ఇక బ్రేక్-ఈవెన్ విషయానికి వస్తే ఈ సినిమా థియేటర్లలో 290 కోట్లు రాబడితేనే సేఫ్ అనవచ్చు. అంటే దాదాపుగా 600 కోట్ల గ్రాస్ రాబట్టాలి. బాహుబలి 2 ఒక్క హిందీలోనే ఈ మొత్తం రాబట్టిన విషయం తెలిసిందే. దీనితో సినిమాకు మంచి టాక్ వస్తే ఈ మాత్రం రాబట్టడం కష్టమేమి కాదు. 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం గనుక బాలీవుడ్ లో విజయవంతమైతే తెలుగు సినిమా ఖ్యాతి జాతీయ స్థాయిలో పెరిగిపోవడం ఖాయం. ప్రభాస్ జాతీయ స్థాయి స్టార్ గా ఎదిగిపోవడమూ పక్కా.