Prabhas-Saahoయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహూ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలతో అన్ని భాషల్లోనూ సినిమా మీద హైప్ భారీగా పెరిగింది. దీనితో సినిమా బిజినెస్ కూడా ముందెన్నడు లేని విధంగా జరుగుతుంది. బాలీవుడ్ లో హిందీ వెర్షన్ దాదాపుగా 4500 థియేటర్స్ లో విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ నెల 30న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మరియు మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై దేశవ్యాప్తంగా ట్రేడ్, ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

ముఖ్యంగా బాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ పెంచడానికి నిర్మాతలు భారీగా ప్లాన్స్ వేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాకు ఒక్కరోజు ముందు దుబాయ్ లో భారీ ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ తో సహా దేశంలోని అన్ని ఇండస్ట్రీల ప్రముఖులను ఈ ప్రీమియర్ కు ఆహ్వానించబోతున్నారు. అలాగే ఆయా భాషల్లోని మీడియాను కూడా స్పెషల్ గా ఆహ్వానిస్తున్నారు. సినిమా ఏ మాత్రం బాగున్నా వారికి నిర్మాతలు ఇచ్చే ట్రీట్మెంట్ కు రివ్యూలు సూపర్ పాజిటివ్ గా రావడం ఖాయం.

దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ భారీ చిత్రం కోసం భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ నెల 18న ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరపబోతున్నారు. గతంలో బాహుబలి 2 ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిపారు. సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే ఇది కూడా బాహుబలి 2గా భారీ హిట్ అయ్యి ప్రభాస్ ను జాతీయ స్థాయి హీరోగా నిలబెడుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.