Saaho producers fail to grab the collectionsయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహూ చిత్ర నిర్మాతలు… అనతికాలంలోనే పెద్ద సినిమాలు నిర్మించారు. పెద్ద డిస్ట్రిబ్యూటర్లుగా అవతారం ఎత్తారు. ఎన్నో పెద్ద చిత్రాలను సక్సెస్ఫుల్ గా పంపిణీ చేశారు. అయితే సాహూతో వారు పెద్ద దెబ్బ తిన్నారు. 350 కోట్లు పెట్టి భారీగా నిర్మించిన సినిమా తుస్స్ మంది. అయితే బాహుబలి 2 తరువాత ప్రభాస్ కు వచ్చిన పాపులారిటీతో సినిమా తనకు ఉన్న టాక్ కంటే బెటర్ గానే పెర్ఫర్మ్ చేసిందని చెప్పుకోవచ్చు.

అయితే దానిని నిర్మాతలు, సినీ ట్రేడ్ సరిగ్గా క్యాష్ చేసుకోలేదని చెప్పుకోవాలి. సినిమా విడుదలకు ముందు రెండు వారాలకు ఎక్కువ రేట్లకు సినిమా అమ్ముకునేలా పర్మిషన్ తెచ్చుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రేట్లు పెంచారు. అయితే వినాయక చవితి సెలవు తరువాత సినిమా టాక్ ని బట్టి వారు రేట్లు తగ్గించేయాల్సింది. అయితే ఆ పని చెయ్యలేదు. రెండో వారంలో సాహూకు ఫ్రీ గ్రౌండ్ దక్కింది. అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ అనేదే లేదు. అయితే ఈ పెంచిన రేట్ల వల్ల రావాల్సిన అడ్వాంటేజ్ రాలేదు.

రేపటి నుండి టిక్కెట్ రేట్లు తగ్గించినా దాని వల్ల ఉపయోగం ఉండదు. సక్సెస్ ఫుల్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అయినా గానీ ఆ మినిమం విషయాన్ని విస్మరించడం కొంత లాస్ అనే చెప్పుకోవాలి. ఇది ఇలా ఉండగా సినిమా తెలుగులో ప్లాప్ గా, తమిళ, మలయాళం భాషలలో డిజాస్టర్ గా ఖాయం అయిపోయింది. హిందీలో మాత్రం ప్రభాస్ ఫేమ్ వల్ల హిట్ దిశగా సాగుతుంది. ఈ ఫలితం కారణంగా ప్రభాస్ ఒకింత డల్ అయిపోయాడట. సినిమా విడుదల తరువాత ప్రమోషన్స్ కు పూర్తిగా దూరంగా ఉండటం గమనార్హం.