Saaho premier shows in USA late than india యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహూ చిత్రం మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెల్లవారు జామున ఒంటిగంటకు పర్మిషన్ ఇవ్వడంతో అమెరికాలో కంటే ఇక్కడే షోస్ ముందుగా పడే అవకాశం ఉంది. మరోవైపు అమెరికాలో చిత్రం అనుకున్నదాని కంటే వెనుకబడే ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. కొన్ని రోజుల ముందుకు ప్రీమియర్లకు వన్ మిలియన్ డాలర్స్ అనేది చాలా చిన్న టార్గెట్ అని అందరూ అనుకున్నారు.

ఇప్పుడు వన్ మిలియన్ డాలర్లు ప్రీమియర్లతో రాబట్టడం కష్టమని అంటున్నారు. ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటివరకూ కేవలం 500,000 డాలర్లు మాత్రమే సినిమా రాబట్టింది. వాక్-ఇన్స్ ద్వారా మిగతా 500కె రాబట్టడం అంత తేలికేమీ కాదు. దీనితో వన్ మిలియన్ డాలర్లు కష్టమే అంటున్నారు నిపుణులు. దీనికి కారణం డిస్ట్రిబ్యూటర్ అనుభవరాహిత్యమే అని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. తెలుగు కంటే అన్ని చోట్లా హిందీ, తమిళ వెర్షన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రైమ్ టైం షోలు వాటికే ఇచ్చారు.

అయితే ఆ భాషలలో టిక్కెట్ల రేట్లు ఎక్కువ ఉండటంతో ఆ వర్గం ప్రేక్షకులు సినిమాను ఆదరించడం లేదు. తెలుగు వెర్షన్ ఇంకా బాగా పెర్ఫర్మ్ చేసే అవకాశం ఉన్నా సరైన షోలు లేవు. దీనితో రెండిటికి చెడ్డ రేవడిలా అయ్యింది పరిస్థితి. ఓవర్సీస్ డీల్ 42 కోట్లకు కుదిరింది. అందులో అమెరికాదే సింహభాగం. ఇది ఇలా ఉండగా అమెరికా పరిస్థితి ఎలా ఉన్నా మిగతా చోట్ల బంపర్ ఓపెనింగ్ వస్తుందని ప్రభాస్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో బాహుబలి 2 రికార్డులు బద్దలు కావడం ఖాయం అంటున్నారు.