Saaho Movie Pre Climax fight costs 80 croresయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. అన్ని భాషల్లోనూ భారీ రిలీజ్ దొరికే అవకాశం ఉంది. ఈ క్రమంలో సెన్సార్ త్వరగా పూర్తి చెయ్యాలని టీం సంకల్పించింది. తెలుగు సెన్సార్ నిన్నే పూర్తి అయ్యింది. తమిళ వెర్షన్ సెన్సార్ ఈరోజు పూర్తి అయ్యే అవకాశం ఉంది. తెలుగు వెర్షన్ కు యూఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే సెన్సార్ పాసైన ఫ్యూటేజ్ రెండు గంటల యాభై నాలుగు నిముషాల నిడివి ఉందట. దాదాపుగా మూడు గంటల సినిమా అంటే ఆషామాషీ కాదు. సహజంగా ఆడియన్స్ ను అంత సేపు థియేటర్లలో కూర్చోబెట్టాలంటే కథ, కథనం చాలా గ్రిప్పింగ్ గా ఉండాలి. ఏ మాత్రం తేడా జరిగినా సినిమా మధ్యలోనే ఆడియన్స్ బయటకు వెళ్ళిపోవడం గారంటీ. దీనితో ఇది కత్తి మీద సామే అని చెప్పుకోవాలి. 350 కోట్ల బడ్జెట్ గల సినిమా కావడంతో దర్శకుడు సుజీత్ మీద పెద్ద బాధ్యత అనే చెప్పుకోవాలి.

బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై దేశవ్యాప్తంగా ట్రేడ్, ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ లో హిందీ వెర్షన్ దాదాపుగా 4500 థియేటర్స్ లో విడుదలకు సిద్ధం అవుతుంది. బాలీవుడ్ లో ఒక్క హిందీ వెర్షన్ మాత్రమే తొలి రోజు 27 కోట్ల నుండి 30 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని ట్రేడ్ అంచనా. అంటే ఈ మధ్య విడుదలైన అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ ఓపెనింగ్ తో సమానం. బాహుబలి 2 స్థాయిలో గనుక ఈ సినిమా హిట్ అయితే ప్రభాస్ జాతీయ స్థాయి స్టార్ గా నిలిచిపోవడం గారంటీ.