SAAHO Movie Tickets prices upయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో అన్ని భాషల్లోనూ సినిమా మీద హైప్ విపరీతంగా ఉంది. సినిమాకు ఏ మాత్రం మంచి టాక్ వచ్చినా బాహుబలి 2 రేంజ్ హిట్ కావడం ఖాయం అంటున్నారు. 350 కోట్ల బడ్జెట్ తో సినిమా కావడంతో తొలి వారాంతం వసూళ్ళ మీద ఎక్కువగా ఆధారపడుతుంది చిత్ర బృందం.

దీనితో రెండు తెలుగు రాష్ట్రాలలో టిక్కెట్ రేట్ల పెంపు, రోజుకు ఐదు షోల పర్మిషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అమెరికాలో టిక్కెట్ల రేట్లు భారీగా పెట్టారు. సినిమా హిట్ అయితే రెండువారాల వరకూ, టాక్ తేడాగా వస్తే ఒక్క వారం పాటు ఈ రేట్లు, ఐదు షోలు ఉండబోతున్నాయి. సినిమాకు ఉన్న హైప్ వల్ల ఈ రేట్లతో పెద్దగా నష్టం ఉండదని నిర్మాతలు భావిస్తున్నారు ఇక బ్రేక్-ఈవెన్ విషయానికి వస్తే ఈ సినిమా థియేటర్లలో 290 కోట్లు రాబడితేనే సేఫ్ అనవచ్చు. అంటే దాదాపుగా 600 కోట్ల గ్రాస్ రాబట్టాలి.

బాహుబలి 2 ఒక్క హిందీలోనే ఈ మొత్తం రాబట్టిన విషయం తెలిసిందే. దీనితో సినిమాకు మంచి టాక్ వస్తే ఈ మాత్రం రాబట్టడం కష్టమేమి కాదు. 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం గనుక బాలీవుడ్ లో విజయవంతమైతే తెలుగు సినిమా ఖ్యాతి జాతీయ స్థాయిలో పెరిగిపోవడం ఖాయం. ప్రభాస్ జాతీయ స్థాయి స్టార్ గా ఎదిగిపోవడమూ పక్కా. అందుకోసమే ఒక స్పెషల్ ఫ్లైట్ లో దేశం మొత్తం చక్కర్లు చుడుతున్నాడు ప్రభాస్. రోజూ అర్ధరాత్రి వరకూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.