Saaho Movie Pre Climax fight costs 80 croresబాహుబలి 2 తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ చిత్రం ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతుంది. నిన్న మొన్నటివరకూ సినిమా మీద అంచనాలు అంతంత మాత్రంగా ఉండగా ట్రైలర్ తో మొత్తం సీన్ మారిపోయింది. అన్ని భాషలలోనూ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా ఏ మాత్రం మంచి టాక్ రాబట్టినా బాహుబలి 2 రికార్డులకు టైమ్ దగ్గరపడినట్టే. ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తుంది.

ఈ చిత్రం ప్రీ-క్లైమాక్స్ లో ఒక ఫైట్ వస్తుందంట. ఆ ఫైట్ దాదాపుగా పెన్నెండున్నర నిముషాల పాటు ఉండి సినిమాకే హైలైట్ గా నిలుస్తుందంట. ఆ ఒక్క ఫైట్ కోసమే నిర్మాతలు 80 కోట్లు ఖర్చుపెట్టారని సమాచారం. దేశచరిత్రలోనే ఒక్క ఫైట్ కు ఇంత ఖర్చుపెట్టడం ఇదే మొదటి సారి. దీనిబట్టి సినిమాను ఏ స్థాయిలో నిర్మించారు అనేది అర్ధం చేసుకోవచ్చు. అభిమానులు ఈ ఫైట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ నెల 30న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మరియు మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై దేశవ్యాప్తంగా ట్రేడ్, ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ లో హిందీ వెర్షన్ దాదాపుగా 4500 థియేటర్స్ లో విడుదలకు సిద్ధం అవుతుంది. బాలీవుడ్ లో ఒక్క హిందీ వెర్షన్ మాత్రమే తొలి రోజు 27 కోట్ల నుండి 30 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని ట్రేడ్ అంచనా. అంటే ఈ మధ్య విడుదలైన అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ ఓపెనింగ్ తో సమానం.