Saaho Movie and RRR movie overseas rights are sold for 43 and  65 crores respectivelyఆగష్టులో విడుదల అయ్యే ప్రభాస్ సాహో, 2020 రెండో భాగంలో వచ్చే రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలు తెలుగులో వచ్చే రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు. దుబాయ్ కు చెందిన ఒక సినిమా పంపిణీదారుడు ఈ రెండు సినిమాల ఓవర్సీస్ రైట్స్ చేజిక్కించుకోవడం విశేషం. దుబాయ్ కు చెందిన ఫార్స్ అనే సంస్థ ఈ రెండు చిత్రాల ఓవర్సీస్ రైట్స్ ను దక్కించుకుంది. అన్ని దేశాల (చైనా తప్ప) అన్ని బాషల రైట్స్ వారు పొందడం విశేషం.

ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఓవర్సీస్ రైట్స్ కోసం వారు 42 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. అదే సమయంలో రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా రైట్స్ కు 67 కోట్ల వరకూ పెట్టిన తెలుస్తుంది. అంటే రెండు సినిమాల మీద 109 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు అయ్యింది. వివిధ దేశాల హక్కులను విడిగా విక్రయించబోతున్నారు. ఏదైనా దేశం నుండి అనుకున్న స్థాయిలో ఆఫర్ రాకపోతే అక్కడ ఇప్పటికే ఉన్న పంపిణీదారులతో సొంతగా రిలీజ్ చేసుకుంటారట.

రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్లు కూడా బయటకు రాకముందే ఓవర్సీస్ రైట్స్ అగ్రీమెంట్స్ అయిపోవడం విశేషం. అది ఈ చిత్రాల మీద ఉన్న హైప్ ను సూచిస్తుంది. సాహో ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల అవుతుంది. అదే సమయంలో ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సాహో చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది మరోవైపు ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ బ్యాంగ్ హైదరాబాద్ లో తీస్తున్నారు.