Saaho Disaster in USA యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెరెకెక్కిన సాహూ చిత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం బలమైన ఓపెనింగ్స్ సాధించింది. బాహుబలి సక్సెస్ తో పెరిగిన ప్రభాస్ పాపులారిటీ దానికి బాగా ఉపయోపడింది అనే చెప్పుకోవాలి. కాగా సాహూ ఎట్టకేలకు రెండవ శనివారం నాటికి యూఎస్ లో 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. దీంతో ఈ చిత్రం, ‘బాహుబలి 2’ 12 మిలియన్, బాహుబలి 6.9 మిలియన్, రంగస్థలం 3.5 మిలియన్ మరియు భరత్ అనే నేను 3.4 మిలియన్ ల జాబితాలో చేరింది.

అయితే ఆదివారంతో సినిమా రన్ దాదాపుగా పూర్తి అయిపోయినట్టే. మంగళవారం డీల్స్ వల్ల కొంత చిల్లర రావొచ్చు. అయితే ఈ సినిమా అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్ అనే చెప్పుకోవాలి. బ్రేక్ ఈవెన్ కు అక్కడ దాదాపుగా ఎనిమిదని మిలియన్ డాలర్లు రాబట్టాల్సి ఉంది, అయితే కనీసం సగం కూడా పని అవ్వలేదు. ఈ పెర్ఫార్మన్స్ కు సినిమా డిస్ట్రిబ్యూటర్ కూడా కారణమే. సరైన ప్లాన్నింగ్ లేకపోవడం వల్ల ప్రీమియర్ల నుండి కనీసం మిలియన్ డాలర్ల ఓపెనింగ్ కూడా రాబట్టలేకపోయింది.

డొమెస్టిక్ మార్కెట్లలో కూడా ఈ వారాంతంతో సినిమా రన్ దాదాపుగా పూర్తి అయిపోయినట్టే. తెలుగులో ప్లాప్ గా, తమిళ, మలయాళం భాషలలో డిజాస్టర్ గా ఖాయం అయిపోయింది. హిందీలో మాత్రం ప్రభాస్ ఫేమ్ వల్ల అనూహ్యంగా హిట్ అయ్యింది. బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే సాహూ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో కలిపి 290 కోట్ల షేర్ రాబట్టాలి. తక్కువలో తక్కువ 80 కోట్ల దాకా నష్టం వస్తుంది. బాలీవుడ్ లో బెటర్ గా పెర్ఫర్మ్ చెయ్యడం ఒక్కటే సినిమా విషయంలో ప్రభాస్ కు పాజిటివ్ అని చెప్పుకోవాలి.