s-s-rajamouli-at-south-conclave-south-mahabaratha-with-jr-ntrకెరీర్ లో ఇంతవరకూ ఒక్క ఫ్లాప్ ను కూడా చూడని టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, కనీవినీ ఎరుగని రీతిలో “మహాభారతం” చిత్రాన్ని తీసి చూపిస్తానని తన మనసులోని మాటను మరోసారి వెల్లడించాడు. సౌత్ కాన్‌క్లేవ్-2017లో పాల్గొన్న జక్కన్న, మహాభారత కథలో ఓ మంచి పాత్రను ఎంచుకుని, దానికి ఓ ఉపకథను తయారు చేసుకున్నానని, అది తనకు నచ్చిన తరువాత తెరపై చూపిస్తానని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

‘బాహుబలి’ చిత్రాన్ని మరో మూడు దశాబ్దాల తరువాత కూడా ప్రజలు గుర్తుంచుకోవాలన్నదే తన కోరికని చెప్పాడు. విజువల్స్ విషయంలో రాజీ పడబోయేది లేదని, వాస్తవ కథ కన్నా, విజువల్స్, ఎమోషన్స్ ను ప్రేక్షకులు మరింతగా ఆదరిస్తారని తెలిపాడు. ఓ ప్రాంతం వాళ్లు ఫలానా జోనర్ చిత్రాలే చూస్తారన్న వాదనకు తాను పూర్తి వ్యతిరేకమని చెప్పుకొచ్చాడు.

మునుపెన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో మహాభారత కథను తెరపై చూపిస్తానని చెప్పిన ఈ వెండితెర జక్కన్న, దాన్ని ఎప్పుడు చెక్కుతానన్న విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. అయితే ఈ మహాభారత కధలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ లేకుండా మాత్రం ఉండదని అంతకుముందే జక్కన్న స్పష్టం చేయడంతో, యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునే టైం వచ్చినట్లుగా కనపడుతోంది.