s-ramachandraiah-high-profile-designated-in-ysrcpఇటీవలే కాంగ్రెస్ నుండి వైకాపా లో చేరిన సీనియర్ నేత,మాజీ మంత్రి సి.రామచంద్రయ్యకు ఆ పార్టీలో బానే కిట్టుబాటు అయ్యింది. ఆయనను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అదే విధంగా ఆయన పార్టీ అదికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆ పార్టీ ఒక అధికారిక ప్రకటన చేసింది. ఇది విజయసాయిరెడ్డి లెవెల్ పోస్టు. స్వతాహా మంచి వక్తగా పేరున్న ఆయనను పార్టీ టీవీ డిబేట్ లలో, పార్టీ ప్రెస్ మీట్లలో బాగా వాడుకోవాలని పార్టీ భావిస్తుంది.

టీడీపీతో కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తున్నా అంటూ కొద్ది రోజుల క్రితం రామచంద్రయ్య వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటించారు. తదనుగుణంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఎపి లో రెండుసార్లు మంత్రిగా, రెండుసార్లు ఎమ్.పిగా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో ఛార్టర్డ్ అకౌంటెంట్ గా పని చేసిన ఆయన టీడీపీ ద్వారా రాజకీయాలలోకి వచ్చారు.

టీడీపీ ఆయనకు సముచిత స్థానం కలిపించినా ఆయన 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన వెంటనే ఆ పార్టీలో చేరి మచిలీపట్నం పార్లమెంట్ కు పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలలో ఓడిపోయి ఆ తరువాత కాంగ్రెస్ ప్రజారాజ్యం విలీనంలో కీలక పాత్ర పోషించారు. కిరణ్ కుమార్ రెడ్డి కాబినెట్ లో మంత్రి అయ్యారు. చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం వల్ల, కాపు కులస్తుడు కావడం వల్ల ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగినా అనూహ్యంగా ఆయన వైకాపా వైపు మొగ్గు చూపారు.