RX100-Movie-Collections---Hit-In-Two-Days---Running--Towards-BBకేవలం 3 కోట్ల పెట్టుబడితో ఇప్పటికీ 12 కోట్లు పైనే కొల్లగొట్టి, ఈ ఏడాది టాప్ 5 బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన “ఆర్ఎక్స్ 100″నుండి వీడియో సాంగ్స్ రిలీజ్ కొనసాగుతోంది. ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న ఈ సినిమాలోని ‘అదిరే హృదయం’ అనే హాట్ హాట్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సినిమా పబ్లిసిటీని ఈ పాటలో ‘హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ బ్యాక్ లెస్’ స్టిల్ నుండే ప్రారంభించారు. అప్పటినుండి మొదలైన క్రేజ్ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. లిప్ లాక్ సన్నివేశాలు, హాట్ హాట్ సీన్స్ కు నిలయంగా మారిన ఈ పాట యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ కావడంతో, రికార్డు స్థాయి క్లిక్స్ తో నెటిజన్లు మోత మోగిస్తారేమో చూడాలి.