Rx100 Roaring Blockbusterప్రతి శుక్రవారం చాలా సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా టీవీ ప్రోమోలలో, పేపర్ ప్రకటనలలో, సోషల్ మీడియా పోస్టర్స్ లో “బ్లాక్ బస్టర్, సూపర్ హిట్” అంటూ రకరకాలుగా పబ్లిసిటీ చేస్తుంటారు. కొందరైతే ఒకడుగు ముందుకేసి ఏకంగా ‘సక్సెస్ మీట్’లు కూడా పెట్టేస్తుంటారు.

ఇలా చేసిన వాటిల్లో కనీసం 10 శాతం సినిమాలు కూడా ఆ విధమైన ఫలితాలను అందివ్వవు. కానీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో హల్చల్ చేస్తోన్న “ఆర్ఎక్స్ 100” ఇస్తోన్న పబ్లిసిటీ మాత్రం, ఆ సినిమాకు వస్తోన్న కలెక్షన్స్ కు నిదర్శనంగా నిలుస్తోంది. “రోరింగ్ బ్లాక్ బస్టర్” అంటూ చిత్ర యూనిట్ సెకండ్ వీక్ పోస్టర్స్ ను రిలీజ్ చేసింది.

నిజమే ‘రోరింగ్ బ్లాక్ బస్టర్’ అన్న పదం ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా తొలి వారం ముగిసే సమయానికి ఏకంగా 7.50 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడమంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ అద్భుతమైన స్పందన వస్తుండడంతో, ఈ ఏడాది అత్యంత లాభదాయకమైన ప్రాజెక్ట్స్ లో టాప్ 5లో ఖచ్చితంగా ‘ఆర్ఎక్స్ 100’ ఒకటి ఉండేలా కనపడుతోంది.