rx-100-hero karthikeyaగత రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో హల్చల్ చేసిన “ఆర్.ఎక్స్ 100” సినిమా, ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తీకేయ వెనుక పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి రావాలని, హీరో కావాలన్న ప్రయత్నం ఈనాటిది కాదు అని, గత కొన్నేళ్ళుగా ప్రయత్నిస్తున్నానని తెలిపాడు.

ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల ఆడిషన్స్ లో పాల్గొన్నానని, కొందరు ఓకే చేసి, ఒక లక్ష రూపాయలు ఉంటే మన సినిమా మొదలైపోతుందని చెప్పేవారని, ఆ డబ్బును తాను సమకూరిస్తే మళ్ళీ అడ్రస్ ఉండేవాళ్ళు కాదని, ఇలా చాలామంది చేతిలో తాను మోసపోయానని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను చెప్పుకొచ్చారు. చివరకు అజయ్ ని కలవడం, ఈ విధంగా ‘ఆర్ఎక్స్ 100’ ద్వారా హీరో అవ్వడం జరిగిందని చెప్పాడు.

సినీ ఇండస్ట్రీలో మహిళలే కాదు, పురుషులు కూడా భారీ స్థాయిలో మోసాలకు గురవుతుంటారని ఈ ఉదంతం చెప్పకనే చెప్తోంది. కార్తీకేయ అయితే ఎలాగలో ఓ సినిమాలో హీరోగా కనిపించారు గానీ, అసలు వెలుగులోకి రాని వారు ఎంతమంది ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమానినైన తాను ‘ఇంద్ర’ సినిమాను ఎన్నిసార్లు చూసానో తనకే లెక్కలేదని చెప్పుకొచ్చారు కార్తీకేయ.