RX-100-First-Rideబైక్ సెగ్మెంట్ లలో ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచిన బైక్ “ఆర్ఎక్స్ 100.” లేటెస్ట్ టెక్నాలజీతో ఎన్నో బైక్స్ దిగుతున్నా… ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఆర్ఎక్స్ 100లకు ఇప్పటికీ రీసేల్ మామూలుగా ఉండదు. అంత సూపర్ హిట్ అయిన బైక్ పేరును సినిమా పేరుగా మలిచి దర్శకుడు అజయ్ భూపతి ఓ సినిమాను రూపొందించాడు.

గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ “ఆర్ఎక్స్ 100” ఫస్ట్ రైడ్ పేరుతో విడుదల చేసిన ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ నిండా విలేజ్ యాక్షన్ సన్నివేశాలు మరియు బోల్డ్ రొమాన్స్, హార్డ్ డైలాగ్స్ నిండి ఉన్నాయి. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లు జంటగా నటించిన ఈ సినిమా ‘అర్జున్ రెడ్డి’ మాదిరి యూత్ ను టార్గెట్ చేసుకున్నారు.

కొత్త జంటకు తోడుగా రావు రమేష్, రాంకీ వంటి సీనియర్ నటులు సన్నివేశాలను రక్తి కట్టించే విధంగా చిత్రీకరించారు. ‘యాన్ ఇంక్రేడిబుల్ లవ్ స్టోరీ’ అంటూ ట్యాగ్ లైన్ వేసిన ఈ సినిమాను జూన్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. యూత్ ఆకర్షణను రాబట్టడంలో ఇప్పటికే చిత్రయూనిట్ సక్సెస్ కావడం ప్లస్ పాయింట్.