again-mudragada-padmanabham-ready-for-deekshaప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేకపోయింది… కనుక ఈ నెల 11వ తేదీ నుండి మళ్ళీ దీక్షలో కూర్చుంటానంటూ ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. మరో వైపు ప్రభుత్వం మాత్రం తాము చెప్పిన విధంగానే కాపులకు రుణాలను మంజూరు చేసామని, అలాగే కాపు కార్పొరేషన్ కు 1000 కోట్లు నిధులు మంజూ చేస్తాము, అయితే అన్నింటికీ సమయం పడుతుంది అంటూ వివరణ ఇచ్చుకుంది. అయితే దీని తర్వాత కూడా ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద అగ్గిలం మీద గుగ్గిలమైన ముద్రగడ, దీక్ష చేపడతానంటూ ప్రకటించి వెనక్కి తగ్గారు.

ప్రభుత్వం చెప్పిన విధంగానే నేడు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణ ప్రకటించిన బడ్జెట్ లో కాపు కార్పొరేషన్ కు 1000 కోట్లు కేటాయించారు. దీంతో ముద్రగడ చేస్తున్న ఆరోపణలకు ఆస్కారం లేకుండా పోయింది. ఇక, ముద్రగడ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. “తానూ చేయదలచుకున్న దీక్షను వాయిదా వేస్తున్నానని, ప్రస్తుతం బడ్జెట్ లో కేటాయించిన నిధులు సరిపోవని, మరో పది రోజుల్లో ఒక్కో జిల్లా నుండి పది మందిని పిలిపించి చర్చిస్తానని, భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని” అన్నారు.

తాజా పరిణామాలతో ప్రభుత్వం వద్ద చిత్తశుద్ది లేదంటూ వ్యాఖ్యానించిన ముద్రగడ నాలుక కరచుకునే పరిస్తితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరో వైపు ముద్రగడ ద్వారా జగన్ సాగించాలనుకున్న రాజకీయ ఎత్తుగడ కూడా విఫలమైందనే మాటలు వినపడుతున్నాయి.