Sukanya-in prostituition caseగతేడాది భారీ హిట్ కొట్టిన ‘శ్రీమంతుడు’ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబుకు తల్లిగా, జగపతిబాబు సతీమణిగా కీలక పాత్ర పోషించిన నటి సుకన్య అవాక్కయ్యే రీతిలో వ్యభిచార కేసులో బుక్కవ్వడం టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.

‘పెద్దరికం’ ద్వారా మంచి కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్న సుకన్య అంటే ప్రేక్షకుల మదిలో సాంప్రదాయ పాత్రలకు పెట్టింది పేరు. అలాంటి సుకన్య చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో వ్యభిచార కేసులో పట్టుపడడం విశేషం. పోలీస్ వర్గాలు చెబుతున్న కధనాల ప్రకారం… 44 సంవత్సరాల సుకన్య విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, వచ్చిన సంపాదన సరిపోక వ్యభిచార వృత్తిలోకి దిగిందని అంటున్నారు.

సుకన్య భాగోతంతో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు అంటే ప్రేక్షకులకు కనిపించేది వేరు… తెరవెనుక జరుగుతోంది వేరు… అన్న భావనకు బలం చేకూరుతోంది. అంతకు ముందు ఈ జాబితాలో ప్రముఖ నటి యమున కూడా ఇదే విధంగా బెంగుళూరులో పట్టుబడిన విషయం తెలిసిందే. అలాగే భువనేశ్వరి, శ్వేతా బసు ప్రసాద్ వంటి హాట్ భామలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.