High Court Divisionఉమ్మడి హైకోర్టు విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుపై జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. భవన సముదాయాలు అధికంగా ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనే తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చెయ్యవచ్చని అంచనా. హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ క్షేత్ర పర్యటన చేసి తీసుకొనే నిర్ణయం కోసం అందరు ఎదురు చూస్తున్నారు.

వారం, పది రోజుల వ్యవధిలోనే కమిటీ అమరావతి ప్రాంతానికి రానున్నట్లు అధికార వర్గాలకు సమాచారం అందింది. వర్శిటీ అయితే గుంటూరు – విజయవాడ ప్రధాన రహదారికి సమీపంలోనే ఉన్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఈ ప్రాంతానికి సులువుగా చేరుకోవచ్చు. అంతేకాకుండా సమీపంలోనే ఐజేఎం విల్లాలు, లింగమనేని ఎస్టేట్స్‌ ఉన్నాయి.

వీటిలో జడ్జిలకు విడిది ఏర్పాటు చెయ్యొచ్చు. తాత్కాలిక భవనమైనా ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఉండాల్సిందేనన్న జడ్జిలలో అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ అక్కడి వసతులు కమిటీకి నచ్చకపోతే ఈ అంశం పక్కన పెట్టొచ్చు. దీనితో ఆ కమిటీ ఏర్పాటు, వారి రిపోర్ట్ గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు తెలంగాణా వారు. అమరావతిలో వసతి నచ్చకపోతే తగిన వసతి హైదరాబాద్ లో చూపిస్తాం ఏపీ హై కోర్టుకి అనే ప్రతిపాదన కూడా చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం.