rumours on prabhas weddingగత వారం రోజులుగా మెగాస్టార్ చిన్నల్లుడుకు సంబంధించిన ఫోటోలు, శ్రీజ వివాహాపు విశేషాలతో సోషల్ మీడియా నిండిపోయింది. అయితే ఈ విషయాలపై ఇప్పటికే ఓ క్లారిటీ రావడంతో దీనిపై ఉన్న ఉత్సుకత వీడిపోయింది. అయితే, ప్రస్తుతం ఈ వంతు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వంతు వచ్చినట్లుంది.

ప్రభాస్ కు కూడా వివాహం చేయనున్నామని రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ కు కాబోయే పెళ్లి కూతురు ఈమెనంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. ‘బాహుబలి’ ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ప్రభాస్ వివాహం వార్తలపై ఇపుడు నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేస్తోంది.

కానీ రెబల్ స్టార్ కుటుంబ వర్గీయుల నుండి ఇప్పటివరకు ఏ విధమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి హల్చల్ చేస్తున్న ఈ ఫోటో ప్రభాస్ కు కాబోయే డ్రీం గర్ల్ అవునో కాదో తెలియాలంటే మరికొద్ది కాలం వెయిట్ చేయలేమో!