rumours on Jr NTR Trivikram Srinivas Movie Storyత్రివిక్రమ్ నేటి తరం తెలుగు దర్శకులలో ఒకానొక సక్సెస్ ఫుల్ డైరెక్టర్. అయితే త్రివిక్రమ్ సినిమా కథల విషయంలో ఎప్పుడూ ఒక వివాదం ఉంటుంది. ఆయన ప్రతి సినిమా కథ, లేకపోతే కొన్ని సీన్లు పాత సినిమాలలో నుండి గానీ, లేకపోతే వేరే భాషా సినిమాల నుండి గానీ ప్రేరణ పొందుతారు. మాములు ప్రేక్షకులకు అవేమీ పట్టకపోయినా, కొందరు మాత్రం దాని గురించి ప్రతీ సారి పెద్ద డిస్కషన్ పెడతారు.

తాజాగా ఆయన కొత్త చిత్రం విషయంలో కూడా ఇవే వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా రూపొందించబడే ఈ సినిమా చిరంజీవి హీరోగా బాపు దర్శకత్వంలో వచ్చిన మంత్రిగారి వియ్యంకుడు చిత్రం కథని పోలి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిత్రబృందం మాత్రం ఇందులో ఏ మాత్రం నిజం లేదు అంటుంది.

అయితే త్రివిక్రమ్ మీద గతంలో ఉన్న వివాదాల నేపథ్యంలో ఈ రూమర్ కొంత కాలం చక్కర్లు కొడుతూనే ఉంటుంది. హారిక హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ల పై స్. రాధాకృష్ణ (చినబాబు) మరియు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి నుండి షూటింగ్ కు వెళుతుంది. ఈ చిత్రాన్ని 2021 వేసవి కి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికం గా ప్రకటించింది.

త్రివిక్రమ్ ఇప్పుడే అల వైకుంఠపురంలో వంటి పెద్ద హిట్ ఇచ్చాడు. దీనితో ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే త్రివిక్రమ్ ఈ సారి ఎటువంటి సినిమా తీస్తారా అని సర్వత్రా చర్చ జరుగుతుంది. అరవింద సమేత విషయంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ శైలిలో సినిమా తీశారు. అయితే త్రివిక్రమ్ శైలిలో తమ హీరోని చూసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.