rumours-on-Chiranjeevi-joining-BJPమొన్న ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి తిరిగి వస్తారని, బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా మీడియాముఖంగా తాము చిరంజీవిని తమ పార్టీలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఇదిగో చేరుతున్నారు అదిగో చేరుతున్నారు అంటూ చేసిన హడావిడి తప్ప ఆ విషయం ముందుకు వెళ్ళలేదు. ఆ తరువాత జనసేన బీజేపీ కలిసి పనిచెయ్యవచ్చు అని పుకార్లు షికారు చేశాయి.

ఇది ఇలా ఉండగా అఖిల భారత చిరంజీవి యువత ప్రతి సంవత్సరం చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అట్టహాసం చేసే విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో ఆగస్ట్ 21న జరుగు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకులు జరపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అఖిల భారత చిరంజీవి యువత ఆదేశాల మేరకు ఆ సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజుని కలిసి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకులకు గౌరవ అతిధిగా ఆహ్వానించారు.

సోము వీర్రాజు కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాది… బీజేపీ టీడీపీ పొత్తు విచ్చినం కావడంతో కీలక పాత్ర పోషించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను 2014లో అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ వద్దకు మొట్టమొదటి సారిగా తీసుకుని వెళ్ళింది ఆయనే. ప్రస్తుతం ఆయన జాతీయ బీజేపీ కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించడం కొత్త చర్చకు తెరలేపింది. దీనిబట్టి చిరంజీవి బీజేపీ మధ్య టాక్స్ నడుస్తున్నాయని మనం అనుకోవాలా?