NTR Father-In-Law cheated NTRహిట్, ఫ్లాప్ అన్న మాటలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ పై ఇటీవల మీడియా వర్గాల్లో ఓ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నాయో గానీ, ఈ వార్తలతో అభిమానులు మాత్రం ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆ సంచలన విషయమేమిటంటే… జూనియర్ ప్రస్తుతం ఆర్ధిక లావాదేవీలతో తెగ ఇబ్బందులు పడుతున్నారట. తనకు పిల్లనిచ్చిన మామే స్వయంగా జూనియర్ ను మోసం చేసినట్లుగా కధనాలు వెలువడుతున్నాయి. మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తున్న సమాచారం మేరకు….

మణికొండలోని కొంత భూమిని చూపించి ప్రణతి తండ్రి నార్నే శ్రీనివాసరావు దాదాపు 9 కోట్లు ఎన్టీఆర్ నుండి తీసుకున్నారట. అయితే ఇదే భూమిని ఐఓబీలో తనఖా పెట్టి నార్నే 11 కోట్లు తీసుకున్నాడట. దీంతో ఆ భూమి మీద జూనియర్ ఇచ్చిన మొత్తం నష్టపోయారట. అంతేకాకుండా వివాహ సమయంలో ఎన్టీఆర్ కు ఇస్తానన్న భారీ మొత్తాన్ని కూడా ఇవ్వకపోగా.. తన అవసరానికి అల్లుడు దగ్గర తీసుకొన్న మొత్తాన్ని కూడా ఇవ్వలేదట. తన కొడుకు ఫస్ట్ బర్త్ డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మణికొండ భూమిని బహుమతిగా ఇవ్వాలనుకున్న సమయంలో ఈ విషయం వెలుగు చూసినట్లుగా ఈ కధనాల సారాంశం. అది జరగక పోవడంతో పుట్టిన రోజు వేడుకలను సాదాసీదాగా జరిపాడట. ఓ పక్కన నందమూరి కుటుంబంతో ఏర్పడిన విభేదాలే ఓ కొలిక్కి రాకపోగా, ఇటీవల సొంత మామతో ఏర్పడిన ఈ వ్యవహారంతో ‘బుడ్డోడు’ కలత చెందినట్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ వార్తలలో ఎంతవరకు వాస్తవముందనేది తెలియాల్సి ఉంది. గిట్టనివాళ్ళు జూనియర్ పై సాగిస్తున్న ప్రచారంలో భాగమేనా? లేక నిజంగానే జూనియర్ ఆర్ధిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్నాడా? బహుశా దీనికి సమాధానం దొరకాలంటే అభిమానులు మరికొద్ది కాలం వెయిట్ చేయక తప్పదేమో!